భద్రాచలం శ్రీ రామచంద్రుని పేరు విషయంలో తనని ఎస్పీ సునీల్ దత్ బెదిరించారని భద్రాద్రి ప్రాంత పరిరక్షణ అధ్యక్షుడు బూసిరెడ్డి శంకర్ రెడ్డి ఆరోపించారు. దీక్షల కోసం ఎస్పీ సునీల్ దత్‌ను అనుమతి కోరగా... సోమవారం సాయంత్రం 4 గంటలకు ఎస్పీ ఫోన్ చేసి బెదిరించారని ఆయన ఆరోపించారు. సంగతి చూస్తా అంటూ కుటుంబ సభ్యుల సమక్షంలో బెదిరించారని మీడియా సమావేశంలో చెప్పారు.
తమ కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురవుతున్నారని ఆయన అన్నారు. తనకు ఏం జరిగినా ఎస్పీ సునీల్ దత్దే పూర్తి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. పేరు మారే వరకు రామనారాయణ వివాదంపై పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పారు. ఎస్పీ తీరుపై కలెక్టర్, డీజీపీ, సీఎంకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.
భద్రాద్రి ఆలయంలో శ్రీరామచంద్రుని పేరుకు బదులు రామనారాయణ పేరుతో పూజలు నిర్వహిస్తున్న తరుణంలో కొంతకాలంగా ఆయన పోరాటం చేస్తున్నారు. గత ఆరు రోజుల క్రితం భద్రాద్రి ఆలయం ఎదుట దీక్షలు చేపట్టారు.
ఇదీ చదవండి: పార్టీ పెట్టొద్దని షర్మిలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాం : సజ్జల