భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాద్రి ఆలయం శ్రీ వైకుంఠ ఏకాదశి మహోత్సవాలకు సిద్ధమైంది. నేటి నుంచి స్వామివారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఫలితంగా ఆలయంలోని ప్రధాన ప్రాంతాలన్నీ అందంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి రామయ్య దర్శనానికి వస్తున్న భక్తులకు ఆలయ ప్రాంతాలు కనువిందు చేస్తున్నాయి.
అలంకరణ కోసం హైదరాబాద్, బెంగళూరు, రాజమండ్రిల నుంచి ప్రత్యేకంగా పూలను తెప్పించారు. శ్రీకాళహస్తి నుంచి తీసుకువచ్చిన 15 మందితో పూలదండలు తయారు చేయించి ఆలయానికి అలంకరిస్తున్నారు. ప్రధాన ద్వారం, ధ్వజస్తంభం, ప్రధానాలయానికి ప్రత్యేకంగా అలంకారం చేశారు. ఫలితంగా భద్రాద్రి ఆలయం శోభాయమానంగా విరాజిల్లుతోంది.
ఇవీ చూడండి: దేశవ్యాప్తంగా 'పౌర' నిరసనలకు వామపక్షాల పిలుపు