ETV Bharat / state

Badradri Ramaiah Devotees: లడ్డూలు తక్కువిచ్చారు.. అడిగితే గెంటివేయించారు..!

భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై ఆలయ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని నిరసిస్తూ భక్తులకు ఆందోళనకు దిగారు. ఆలయంలో సిబ్బందికి వ్యతిరేకంగా బైఠాయించారు. పోలీసులు సర్ది చెప్పగా గొడవ సద్దుమణిగింది.

Bhadradri
భద్రాద్రి
author img

By

Published : Sep 21, 2021, 10:05 PM IST

భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల (Badradri Ramaiah Devotees)పై ఆలయ సిబ్బంది వీరంగం సృష్టించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలానికి చెందిన సుమారు 30 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు మంగళవారం సాయంత్రం భద్రాచలం వచ్చారు. ఈ నేపథ్యంలో దర్శనం అనంతరం స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని కొనుగోలు చేశారు. ఒక్కో లడ్డు 20 రూపాయలు చొప్పున 50 లడ్డూలకు 1,000 రూపాయలు ఇచ్చి టోకెన్లు తీసుకున్నారు.

టోకెన్లు ఇచ్చి లడ్డూలు తీసుకునే క్రమంలో 50 లడ్డూలకి బదులు ఇరవై లడ్డూలు మాత్రమే ఇచ్చారని భక్తులు వాపోయారు. ఇదేమిటని ప్రశ్నించగా లడ్డు కౌంటర్​లోని ఆలయ సిబ్బంది భక్తులపై వాగ్వాదానికి దిగారు. ఆలయ పోలీసులను పిలిపించి బయటకు నెట్టివేయించారు. మనస్తాపం చెందిన భక్తులు ఆలయ ఈవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. చాలాసేపు నిరసన చేసిన అనంతరం పట్టణ సీఐ స్వామి భక్తులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు.

దురుసుగా ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వగా ధర్నా విరమించారు. చాలా దూరం నుంచి స్వామి వారిపై ఉన్న భక్తితో దర్శనం కోసం వస్తే ఆలయ సిబ్బంది భక్తులను మోసం చేయడమే కాకుండా గొడవకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

భద్రాద్రి రామయ్య భక్తులపై ఆలయ సిబ్బంది వీరంగం

ఇదీ చూడండి: కొండా విశ్వేశ్వర్ రెడ్డి వైట్​ ఛాలెంజ్​కు సిద్ధం: బండి సంజయ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.