మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లోని గిరిజనులతో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉండేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండటంతో పోలీసులు ప్రణాళిక రచించారు. సీఆర్పీఎఫ్ సాయంతో ఎస్పీ సునీల్ దత్ 184 గిరిజన కుటుంబాలకు వాటర్ ఫిల్టర్లు అందించారు. ఆయా గ్రామాల్లో ఎక్కువ శాతం మందికి సురక్షిత తాగునీరు అందడం లేదని గుర్తించిన పోలీసులు ఈ కార్యక్రమం చేపట్టారు.
కొన్ని రోజుల క్రితం చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో పోలీసులు మెగా ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. గురువారం చర్ల మండలంలోని పెద మిడిసిలెరు చెన్నాపురం, చిన్న మిడిసెలరు బట్టిగూడెం, రామచంద్రాపురం గ్రామాల్లో సురక్షిత నీటి కోసం వాటర్ ఫిల్టర్లు అందజేశారు. గిరిజనులంతా తమపై నమ్మకం ఉంచి మావోయిస్టుల సంబంధిత సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ వినీత్, చర్ల సీఐ అశోక్, ఎస్సైలు రాజు, వర్మ, వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కాలేేజీలు తెరవాలని రోడ్డెక్కిన విద్యార్థులు