COLLECTOR VISIT TEMPLE: మహాశివరాత్రి సందర్భంగా బూర్గంపాడు మండలం మోతె గ్రామంలోని శ్రీ వీరభద్ర స్వామి దేవాలయాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దర్శించుకున్నారు. ఈ ఆలయాన్ని శివరాత్రి రోజున మాత్రమే తెరుస్తారు.
కలెక్టర్కు ఆలయ ఈవో వేణుగోపాల్ గుప్తా ఘన స్వాగతం పలికారు. మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజ్ పూజలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: భద్రాద్రి రామయ్య కల్యాణానికి సిద్ధమవుతున్న గోటి తలంబ్రాలు