దక్షిణ భారతదేశ గంగానదిగా పేరొందిన గోదావరి భద్రాచలం వద్ద పిల్లకాలువలా మారి ఆందోళన కలిగిస్తోంది. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం రెండు అడుగుల కంటే తక్కువగా నీటి మట్టం నమోదవుతోంది.
అడుగంటిన గోదావరి జలాలు రాష్ట్రంలో పలు చోట్ల మిషన్ భగీరథ పథకానికి తాగునీటి కష్టాలు తేనున్నాయి. పదేళ్ల క్రితం వేసవికాలంలో కనిష్ఠంగా నీటిమట్టం 6 అడుగులు నమోదయింది.అయితే గత కొంత కాలంగా వేసవికాలంలో నీటి మట్టం 4 అడుగులలోపే ఉంటోంది.
ఇదీ చదవండి: పీపీఈ కిట్ లేకుండా వెళ్లడం తప్పు: బండి సంజయ్