తెలంగాణ ఆడబిడ్డల కోసం బతుకమ్మ కానుకగా ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఖమ్మం జిల్లాలో లాంఛనంగా ప్రారంభమైంది. నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధులు, అధికారులు చీరల పంపిణీని ప్రారంభించారు. ఖమ్మం జిల్లాలో 3,69,520 చీరలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3,48,418 చీరలను పంపిణీ చేయనున్నారు.
ఖమ్మం, రఘునాథపాలెం మండలాల్లో మంత్రి పువ్వాడ అజయ్.. తల్లాడలో ఎమ్మెల్యే సండ్ర, పాలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి... మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కొవిడ్ దృష్ట్యా మాస్కులు ధరించి.. భౌతిక దూరం పాటిస్తూ బతుకమ్మ చీరల పంపిణీ ప్రక్రియను చేపట్టారు.
ఇదీ చదవండి: బతుకమ్మ, దసరా ఇళ్ల వద్దనే చేసుకోవాలి: మంత్రి ఈటల