ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సందడి నెలకొంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని గ్రామాలు, పట్టణాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. 9 రోజుల పాటు వివిధ రూపాల్లో బతుకమ్మను కొలిచిన మహిళలు.. తుది వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్నారు. సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించేందుకు తీరొక్క పూలతో అందమైన బతుకమ్మలను పేరుస్తున్నారు.
కరోనా తీవ్రతతో
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైభవంగా జరగాల్సిన సద్దుల బతుకమ్మ వేడుకలు నిరాడంబరంగా జరగనున్నాయి. కరోనా వ్యాప్తి తీవ్రత దృష్ట్యా మహిళలు సామూహిక వేడుకల్లో పాల్గొనడం లేదు.
సద్దుల బతుకమ్మతో బతుకమ్మ సంబురాలు ముగియనున్నాయి. ఖమ్మంలోని మున్నేరు ఒడ్డున సాయంత్రం ఈ వేడుకలు జరగనున్నాయి.
ఇదీ చదవండి: మీ "కోటి కొలువులు" ఏమయ్యాయి?: మంత్రి హరీశ్ రావు