తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు ప్రతీకగా నిలిచే... బతుకమ్మ వేడుకలు... ఆద్యంతం కన్నులపండువగా జరిగాయి (bathukamma celebrations). వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. హనుమకొండలోని పద్మాక్షిగుండం ప్రాంగణం ఆడపడుచులతో కిక్కిరిసిపోయింది. తీరొక్క పూలతో అందంగా తీర్దిదిద్దిన బతుకమ్మల చుట్టూ చేరి.... మహిళలు ఆడి పాడారు. ఉయ్యాల పాటలతో... పరిసరాలు మారుమోగాయి (bathukamma celebrations). ములుగులోని తోపుకుంట వద్ద నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే సీతక్క పాల్గొని... ఆడపడుచులతో కలిసి ఆడిపాడారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో ఆడపడుచులు అత్యంత భక్తిశ్రద్ధలతో బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో సందడి చేశారు.
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో...
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో... సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ మహిళలు ఆడిపాడారు. గన్‌ఫౌండ్రిలో భాజపా ఆధ్వర్యంలో పూలపండుగ వేడుకలు కోలాహాలంగా జరిగాయి (bathukamma celebrations). మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆటాపాటలతో హోరెత్తించారు. బాగ్‌లింగంపల్లిలో అక్షర స్ఫూర్తి సంస్థ నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మాజీఎంపీ భాజపా నాయకురాలు విజయశాంతి పాల్గొని.... వేడుకల్లో ఉత్సాహాన్ని పెంచారు. హైదరాబాద్ నాగారం మున్సిపాలిటీ పరిధి సత్యనారాయణకాలనీలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని... పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు.
భద్రాచలంలో బతుకమ్మ ఆడిన యాంకర్ మేఘన
ఖమ్మం జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబురాలు సందడిగా సాగాయి. నగరంలో మహిళలు బతుకమ్మలతో మున్నేరు నది ఒడ్డుకు చేరి ఆడిపాడారు (bathukamma celebrations). సత్తుపల్లిలో సద్దుల బతుకమ్మ ఊరేగింపు కన్నులపండువగా సాగింది. 30 అడుగుల బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భద్రాచలం రామాలయం వద్ద పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. వేడుకల్లో పాల్గొన్న యాంకర్ మేఘన.... యువతులు, చిన్నారులతో కలిసి బతుకమ్మ ఆడారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో మహిళలు బతకమ్మ ఆడుతూ ఉత్సాహంగా గడిపారు.
సిద్దిపేట కోమటి చెరువు వద్ద బతుకమ్మ సందడి
సిద్దిపేటలోని కోమటి చెరువు వద్ద సద్దుల బతుకమ్మ సందడిగా సాగింది. మంత్రి హరీశ్‌రావు నివాసంలో ఆయన సతీమణి, కుమార్తె, స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన పూల పండుగ వేడుకల్లో... సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆడపడుచులతో కలిసి సందడి చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో ఆడపడుచులంతా కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో తెలుగు సాంస్కృతిక పరిషత్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు (bathukamma celebrations). మహిళలు, యువతులు అందమైన బతుకమ్మలు పేర్చి ఆడిపాడారు.
జోగులాంబ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా... గద్వాల జిల్లాలోని ఐదో శక్తిపీఠం జోగులాంబ అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కర్నూల్ కలెక్టర్ పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం కలెక్టర్ కోటేశ్వరరావు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. హైదరాబాద్ హాయత్‌నగర్ పరిధి శాంతినగర్‌లో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. స్థానికులు దుర్గామాతా విగ్రహాన్ని ప్రతిష్టించి తొమ్మిదిరోజులపాటు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సద్దుల బతుకమ్మ సందర్భంగా స్థానిక మహిళలు ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ ఆడుతూ ఉత్సాహంగా గడిపారు.
ఇదీ చూడండి: Saddula Bathukamma: పూల జాతరతో ఉయ్యాలో.. పరవశించెనే తెలంగాణ ఉయ్యాలో..