ETV Bharat / state

Badradri Collector: విద్యార్థులతో కలిసి నృత్యం చేసిన భద్రాద్రి కలెక్టర్​..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్​ అనుదీప్​.. విద్యార్థులతో కలిసి నృత్యం చేశారు. భద్రాచలంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్​.. సామాజిక ఆరోగ్య కార్యకర్తల శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించారు. విద్యార్థులు ప్రదర్శించిన ఆదివాసీల నృత్యంలో తానూ కాలు కదిపారు.

badradri kothagudem collector anudeep dance with students in badrachalam

author img

By

Published : Aug 14, 2021, 10:04 PM IST

విద్యార్థులతో కలిసి నృత్యం చేసిన భద్రాద్రి కలెక్టర్​..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని పలు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ పర్యటించారు. వైటీసీలో నిర్వహిస్తున్న సామాజిక ఆరోగ్య కార్యకర్తల శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించారు. మారుమూల ప్రాంతాలున్న జిల్లాలో వైద్య సేవలను ప్రతి ఆవాసానికి తీసుకెళ్లటంలో ఆరోగ్య సామాజిక కార్యకర్తల సహకారం చాలా అవసరమని తెలిపారు.

మాతాశిశు మరణాలు తగ్గించడానికి నిర్వహిస్తున్న కార్యక్రమంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని యువతకు సూచించారు. వైద్యం అందక ఏ ఒక్క ప్రాణం పోవడానికి వీల్లేకుండా అందరూ వైద్య సైనికుల్లా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్య కార్యకర్తలకు కిట్లను ప్రదానం చేశారు. శిక్షణ పూర్తయిన యువతీ యువకులు ఆదివాసీల నృత్యాన్ని ప్రదర్శించగా... వారితో కలిసి కలెక్టర్ కాలు కదిపారు. అందరితో పాటు నృత్యం చేసి యువతలో ఉత్సాహాన్ని నింపారు.

ఇదీ చూడండి:

స్వాతి లక్రా, బండ శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర‌ప‌తి విశిష్ట సేవా పోలీసు ప‌త‌కాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.