కొవిడ్ నిబంధనలు పాటించని వివాహాలపై అధికారులు కొరడా ఝలిపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో కొవిడ్ నిబంధనలు పాటించకుండా, ఎటువంటి అనుమతులు తీసుకోకుండా జరుగుతున్న కార్యక్రమాలను అడ్డుకున్నారు. తహసీల్దార్ శ్రీనివాసరావు, సీఐ రాజు ఆధ్వర్యంలో 45 మందిపై కేసు నమోదు చేశారు.
పెళ్లి వేడుకలో ఎక్కువమంది హాజరు కావడం వల్ల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా విందులు వాయిదా వేసుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: Online Loan Apps : ఎస్సైనని బెదిరించి ఖాతా ఖల్లాస్