భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామిని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంగళవాద్యాలతో ఆలయ అధికారులు, పండితులు తమ్మినేనికి ఘనస్వాగతం పలికారు. స్వామికి తమ్మినేని కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రసాదాన్ని, స్వామి వారి చిత్రపటాన్ని వేద పండితులు తమ్మినేనికి అందించారు. రామయ్య సన్నిధిలో నిత్య అన్నదాన కార్యక్రమానికి తమ్మినేని సీతారాం రూ.లక్ష ఇచ్చారు.
ఇవీచూడండి: శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి