భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండాలో డంపింగ్ యార్డ్ ప్రారంభోత్సవానికి వచ్చిన కలెక్టర్ రజత్ కుమార్ శైనీ పది నిమిషాలు వేచి ఉండాల్సి వచ్చింది. ప్రారంభోత్సవానికి రిబ్బన్ కట్టి ఏర్పాట్లు చేసిన అధికారులు... కత్తెర మర్చిపోవడం చర్చనీయాంశమైంది. తొలుత మాచినేనిపేట తండా పంచాయతీ కార్యాలయంలో కలెక్టర్ ఓ గదిని ప్రారంభించారు.
ఎట్టకేలకు కత్తెర తెచ్చారు... రిబ్బన్ కత్తిరించారు
అక్కడి నుంచి పడమటి నరసాపురం- మాచినేనిపేట రహదారిలో నిర్మాణం పూర్తి చేసుకున్న డంపింగ్ యార్డ్‌ను ప్రారంభించేందుకెళ్లారు. కలెక్టర్ వెళ్తుండగా అక్కడ ప్రజాప్రతినిధులు... అధికారులు... హడావుడిగా ఆయనతోపాటు వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లిన పాలనాధికారికి రిబ్బన్ కత్తిరించేందుకు కత్తెర అడగగా అంతా బిత్తర పోవాల్సి వచ్చింది. హడావిడిగా కత్తెర కోసం సిబ్బంది వెళ్లగా కార్యక్రమం ఆలస్యమైంది. కలెక్టర్ సిబ్బందితో తన కారులో ఉన్న కత్తెరను తెప్పించి రిబ్బన్ కత్తిరించి ప్రారంభోత్సవం చేశారు.
ఇవీ చూడండి : కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ