కాంగ్రెస్ పార్టీలో గెలుపొంది.. అధికార పార్టీ తెరాసలోకి పార్టీ ఫిరాయించిన రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు కాంగ్రెస్ కార్యాలయాన్ని కూడా కబ్జా చేశారని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. పినపాక ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన రేగా.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ మారడాన్ని వంశీచంద్ రెడ్డి దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.
కాంగ్రెస్ కార్యకర్తలు ఆహర్నిశలు కష్టపడి, నిద్రాహారాలు మానకుని తమ అభ్యర్థిని గెలిపిస్తే.. తాను అధికార పార్టీకి అమ్ముడుపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. మణుగూరులో ఆందోళన చేస్తున్న హస్తం నేతలకు మద్దతు పలికేందుకు వెళ్లిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను పోలీసులు అడ్డుకోవడంపై ఆయన ధ్వజమెత్తారు. తెరాస ఆగడాలను అడ్డుకోవడానికి ప్రజలు మరో ఉద్యమంతో ముందుకు రావాలని వంశీచంద్ అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి: కరోనాతో ఆర్టీసీకి తగ్గిన ఆదాయం.. పార్శిల్పైనే ఆశలు