భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఇవాళ అగ్ని ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 8 వరకు శ్రీరామనవమి వసంత పక్ష తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా రాయికి రాయికి నడుమ రాపిడి కలిగించి అగ్ని పుట్టించారు. అనంతరం గరుడ పటాన్ని ధ్వజస్తంభం ఎదుట అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం గరుడ ప్రసాదాన్ని అర్చకులు అందించారు. ఏటా సంతానం లేని భక్తులకు గరుడ ప్రసాదాన్ని అందించేవారు. కానీ ఈసారి భక్తులను అనుమతించకపోవడం వల్ల ఆలయ అర్చకులు వేడుకలను ఏకాంతంగా నిర్వహించాారు. బుధవారం ఎదుర్కోళ్లు ఉత్సవం, ఏప్రిల్ 2న సీతారాముల కళ్యాణం, 3న మహాపట్టాభిషేకం నిర్వహిస్తారు.
ఇదీ చూడండి: ఆ బయోపిక్కు నో చెప్పిన బాలయ్య!