ETV Bharat / state

కరోనాతో గర్బణి మృతి.. సంతాపం ప్రకటించిన జిల్లా కలెక్టర్ - కొత్తగూడెం జిల్లా కరోనా వార్తలు

కొద్దిరోజుల్లో తల్లి కాబోతున్ననన్న ఆమె సంతోషాన్ని కరోనా విషాదంగా మార్చింది. మహమ్మారి బారినపడి నిండు గర్భిణి మృతి చెందింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగింది. మృతురాలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టైపిస్టుగా విధులు నిర్వర్తించేది. ఆమె మృతి పట్ల జిల్లా కలెక్టర్ సంతాపం ప్రకటించారు.

A pregnant woman died in Kottagudem district with Corona
కరోనాతో గర్భిణి మృతి
author img

By

Published : May 17, 2021, 7:50 PM IST

కరోనా బారినపడి జయసుధ అనే నిండు గర్భిణి మృతి చెందింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగింది. మృతురాలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టైపిస్టుగా ఉద్యోగం చేసేది. జయసుధ మరణం పట్ల జిల్లా కలెక్టర్ ఎం వి రెడ్డి సంతాపం ప్రకటించారు.

జయసుధకు కరోనా లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆమెను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం ఆమె కన్నుమూశారు. జయసుధ గతంలో అశ్వాపురం మండలం పరిధిలోని పలు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తించి అందరి మన్ననలు పొందారు. కొద్దికాలంలోనే మంచి కార్యదర్శిగా పేరు సంపాదించుకున్నారు.

ఇదీ చదవండి: కరోనా చికిత్స, బ్లాక్ ఫంగస్, ఔషధాలు, టీకాలపై సీఎం సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.