భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని కూనవరం రోడ్డులో అక్రమంగా కారులో తరలిస్తున్న రూ.30 లక్షల విలువగల రెండు క్వింటాళ్ల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతం నుంచి భద్రాచలం మీదుగా జహీరాబాద్‌కు తరలిస్తుండగా పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న కారుతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారం మేరకు ప్రత్యేక నిఘా పెట్టి పట్టుకున్నట్లు పట్టణ సీఐ వినోద్ రెడ్డి వెల్లడించారు.
ఇవీచూడడి: ఆర్టీసీ సమ్మెను దిల్లీకి తీసుకెళ్తాం: అశ్వత్థామరెడ్డి