ఏడాదిగా తనకు ఉద్యోగం ఇవ్వకుండా తిప్పుతున్నారంటూ ఇచ్చోడ మండలం మాల్యాల గ్రామానికి చెందిన గణేష్ ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశమందిర భవనం ఎక్కి దుకుతానని బెదిరించడం కలకలం రేపింది. ప్రజావాణికి వచ్చిన అతను... భవనం ఎక్కగా పోలీసులు వచ్చి కిందకి దించడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం తన గోడును అధికారుల ముందు చెప్పాడు. వారు తగు చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు.
ఇదీ చూడండి: వచ్చే ఎన్నికల్లో భాజపాదే అధికారం: కిషన్ రెడ్డి