ఆదిలాబాద్ జిల్లా అడవులు జలపాతాల సవ్వడితో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. రాష్ట్రంలో ఎత్తైన జలపాతంగా పేరుగాంచిన కుంటాల.. తొలకరి జల్లులకే.. ప్రకృతి ఒడిని పులకింపజేస్తోంది.

కుంటాల మండలంలోనే గుత్పలా జలపాతం ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తోంది. బోథ్ మండలంలోని పొచ్చర జలపాతం హోయలొలికే నీటిధారతో కనువిందు చేస్తోంది. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం పర్యాటకులను జలపాతాల వద్దకు అనుమతించడం లేదు.
