ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో వినాయక నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావు, జిల్లా జడ్పీ ఛైర్మన్ రాథోడ్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అందరూ ఐక్యంగా ఉండాలని మోదీ పాలనలో ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకున్నట్లు ఎంపీ తెలిపారు. మహిళల కోలాటాల ప్రదర్శన, భక్త జన సందోహం మధ్య నిమజ్జన శోభయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ ఉత్సవాలు నిర్వహించుకోవాలని జడ్పీ ఛైర్మన్ రాథోడ్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: గణేశుని నిమజ్జనం... భద్రతా వలయంలో భాగ్యనగరం