ఆదిలాబాద్‌లోని అన్ని ప్రభుత్వ వసతిగృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. ఆయా సమస్యలపై ఫ్లకార్డులు ప్రదర్శించారు. నిరసనలో భాగంగా ఆదివాసీ విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
ఇదీ చూడండి : డ్రైనేజీ నాలాల స్థలం కబ్జా.. ఇబ్బందుల్లో ప్రజలు