ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట వేకువజాము నుంచే తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధుల్లో చేరేందుకు క్యూ కట్టారు. పోలీసు బందోబస్తు మధ్య ఆర్టీసీ బస్సులను బయటకు పంపిస్తున్నారు. కార్మికులు విధుల్లో చేరతామని ప్రకటించిన నేపథ్యంలో పోలీసులను భారీగా మోహరించారు.
విధుల్లో చేరేందుకు వస్తున్న కార్మికులను అడ్డుకునేందుకు పోలీసులు డిపోలకు చేరుకోకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కార్మికులంతా సుందరయ్య భవన్ వద్ద గుమిగూడారు. బలవంతంగా విధుల్లో చేరేందుకు వస్తే అరెస్టులు తప్పవని ఆదిలాబాద్ డీఎసపీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: డిపోలకు వస్తున్న కార్మికులు... అడ్డుకుంటున్న పోలీసులు...