ETV Bharat / state

Solar eclipse 2022: పాతికేళ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం.. పోటీపడి వీక్షించిన జనం - సూర్యగ్రహణం తెలంగాణ

Solar eclipse 2022: ఆకాశంలో అద్భుత దృశ్యం కనిపించింది. దాదాపు 25 సంవత్సరాల తరవాత దీపావళి తరవాత సూర్యగ్రహణం కావడంతో ప్రజలకు ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో మాత్రమే సంపూర్ణంగా కనిపించే ఈ గ్రహణం.. భారత్​లో మాత్రం పాక్షికంగా కనిపించింది. అయితే అందరూ ఈ గ్రహణం చూడడానికి ప్రత్యేక ఏర్పాట్లును చేసుకున్నారు.

Total solar eclipse in Telangana
సూర్యగ్రహణం
author img

By

Published : Oct 25, 2022, 8:19 PM IST

Updated : Oct 25, 2022, 9:01 PM IST

Surya grahanam 2022: రాష్ట్రంలో సూర్యగ్రహణ పాక్షికంగా కనిపించింది. హైదరాబాద్‌లో 4.59 గం.కు ప్రారంభమై.. సాయంత్రం 6గంటల 26 నిమిషాలకు ముగిసింది. పలుచోట్ల ప్రజలు టెలిస్కోప్‌లతో గ్రహాన్ని వీక్షించారు. ప్రారంభంలో పసుపు వర్ణంలో ఉన్న సూర్యుడు సూర్యగ్రహణం పూర్యయ్యే సరికి ఎరుపు వర్ణంలోకి మారింది. ఈ అద్భుత దృశ్యాన్ని ప్రజలు కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుని ఆసక్తిగా తిలకించారు.

రాష్ట్రవ్యాప్తంగా పాక్షిక సూర్యగ్రహణం వీక్షిస్తున్న ప్రజానికం

హైదరాబాద్‌ బిర్లా ప్లానిటోరియం వద్ద గ్రహాణాన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెద్దలు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా తిలకించారు. దాదాపు 25ఏళ్ల తర్వాత దీపావళి అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడిందని, ఈ ఖగోళ అద్భుతాన్ని చూసేందుకు ఔత్సాహికులు భారీగా తరలివచ్చారు. ఇందుకోసం రెండు భారీ టెలిస్కోప్‌లు ఏర్పాటు చేశారు. క్యూలైన్‌లో నిల్చొని ఒక్కొక్కరు టెలిస్కోప్‌ ద్వారా గ్రహణాన్ని వీక్షించారు.

పాతికేళ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం
పాతికేళ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం

టెలిస్కోప్‌ను ప్రొజెక్టర్‌కు అనుసంధానం చేసి తెరపైనా వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. మరికొందరు బ్లాక్‌ కలర్‌ ఫిల్మ్‌ ద్వారా గ్రహణాన్ని వీక్షించారు. గ్రహణం అంటే ఏమిటి? గ్రహణాలు ఎందుకు ఏర్పడతాయి? అనే విషయాలపై ఈ సందర్భంగా బిర్లా ప్లానిటోరియం సిబ్బంది విద్యార్థులకు అవగాహన కల్పించారు. టెలిస్కోప్‌ ద్వారా నేరుగా సూర్య గ్రహణం వీక్షించడం కొత్త అనుభూతినిచ్చిందని పలువురు ఔత్సాహికులు తెలిపారు.

పాతికేళ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం
పాతికేళ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం

పట్టు, విడుపు స్నానాలు.. గ్రహదోష నివారణ పూజలు.. సూర్యగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నింటినీ మూసివేశారు. సంప్రోక్షణ తర్వాత భక్తులను తిరిగి దర్శనానికి అనుమతించనున్నారు. గ్రహణం సందర్భంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అత్యంత భక్తి శ్రద్ధలతో గ్రహణం పట్టు విడుపు స్నానాలు ఆచరించారు.అనంతరం గ్రహణ దోష పరిహారాలను నిర్వహించారు.

పాతికేళ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం
పాతికేళ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం

ఏపీలో సూర్యగ్రహణం.. ఏపీలోనూ సూర్య గ్రహణాన్ని విద్యార్థులు, ప్రజలు ఆసక్తిగా తిలకించారు. విజయవాడలో గ్రహణం పాక్షికంగా కనిపించగా.. ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రాంతీయ సైన్స్‌ సెంటర్‌ కళ్లజోళ్లు సమకూర్చింది. విద్యార్థులు, కొందరు ఔత్సాహికులు ఆసక్తిగా వీక్షించారు. రాజమహేంద్రవరంలోని గోదావరి తీరంలో గ్రహణం కనువిందు చేసింది. గ్రహణం విడిచాక చాలా మంది భక్తులు గోదావరి నదీలో స్నానాలు ఆచరించారు.

పాతికేళ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం
పాతికేళ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం

సూర్యగ్రహణం సందర్భంగా పలుచోట్ల రోకళ్లు నిలబడ్డాయంటూ.. దృశ్యాలు చక్కర్లు కొడుతున్నాయి. విజయవాడలోని యనమలకుదురులోని ఓ ఇంట్లోని రోట్లో రోకళ్లు నిలబడగా.. కోడూరు మండలం స్వతంత్రపురంలోని ఇంకో ఇంట్లో రోకళ్లు చిన్న ప్లేటులో నిటారుగా నిలబడ్డాయని స్థానికులు తెలిపారు. గ్రహణం ప్రభావం వల్లే ఇలా జరిగిందంటూ ఇరుగుపొరుగువారంతా ఆసక్తిగా తిలకించారు.

హైదరాబాద్​ బిర్లా ప్లానిటోరియం వద్ద సూర్య గ్రహణాన్ని వీక్షిస్తున్న ప్రజలు

ఇవీ చదవండి:

Last Updated : Oct 25, 2022, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.