ప్రస్తుతం వానాకాలంలో సన్నరకాలైన జైశ్రీరాం, జేజీటీఎల్, ఆర్‌ఎన్‌ఆర్ 1504(తెలంగాణ సోనా) సాగు చేస్తుండగా... యాసంగిలో కేవలం దొడ్డు రకాలు మాత్రమే పండిస్తున్నారు. జిల్లాలో సన్నరకాల సాగు 60 నుంచి 70 శాతం పెంచేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
పత్తి సాగులో తేడా అంతంతే..
జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తున్నారు. దీనికి మార్కెట్‌లో డిమాండ్ ఉండటంతో ప్రభుత్వం సైతం ప్రోత్సహిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 1.80 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఎక్కువగా వర్షాధార పంట కిందనే సాగు చేస్తుండగా నీటి వనరులు ఉన్న చోట కూడా సాగును ప్రోత్సహిస్తుండటంతో మరో 5 వేల ఎకరాల సాగు పెరగనుంది.
కంది సాగు అంతంత మాత్రమే
జిల్లాలో కంది సాగు అంతంత మాత్రమే...మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో రైతులు ముందుకు రావడం లేదు.. పప్పు దినుసులకు ఉన్న డిమాండుకు దృష్ట్యా ప్రభుత్వం వీటి సాగు పెంచాలని సూచించడంతో వరి గట్లపై, పత్తిలో అంతర సాగు అవసరమైన చోట ప్రత్యేకంగా వీటిని సాగు చేయాల్సిన అవసరం ఉంది.
ఈసారి : 7,500 నుంచి 10 వేల ఎకరాల్లో సాగు చేసేందుకు చర్యలు
సాగు ఇలా..
వానాకాలం: మొత్తం సాగు 1.62 లక్షల ఎకరాలు
సన్నరకం: 60 శాతం
దొడ్డు రకం: 40 శాతం
ఇందులో సన్నరకాన్ని మరో 15 శాతం పెంచేందుకు చర్యలు
యాసంగి: మొత్తం: 95 వేల ఎకరాలు
మొత్తం దొడ్డు రకమే
సన్నరకం కనీసం 60 శాతం ఉండేలా చూడాలి
సన్నరకం వరి సాగు పెంచేందుకు చర్యలు
ప్రభుత్వం సూచించిన మేర జిల్లాలో సన్నరకం వరి, పత్తి, కంది పంట సాగు మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. క్షేత్రస్థాయిలో రైతులను కలిసి సాగును ప్రోత్సహిస్తాం.
- వీరయ్య, జిల్లా వ్యవసాయ అధికారి
ఇవీ చూడండి: