ఆదిలాబాద్ కేంద్రంలోని రిమ్స్ నర్సింగ్ కళాశాలలో విద్యార్థినులకు ర్యాగింగ్ నిరోధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయసేవా అధికారసంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధానన్యాయమూర్తి ప్రియదర్శిని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని.. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే చట్టరీత్యా కఠినశిక్షలు ఉంటాయని తెలిపారు. చదువుపై దృష్టిసారించాలని హితవుపలికారు. ఈ సదస్సులో న్యాయసేవా అధికారసంస్థ కార్యదర్శి జీవన్‌కుమార్, రిమ్స్ సూపరింటెండెంట్ అనంతరావు పాల్గొన్నారు.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)