ETV Bharat / state

తెలుగు రాష్ట్రాల విద్యార్థుల గోస - కరోనా లాక్​డౌన్​ తెలుగు విద్యార్థులు

లాక్​డౌన్​ వల్ల మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లాలో సేంద్రీయ వ్యవసాయ శిక్షణ పొందుతున్న తెలుగు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రవాణా సౌకర్యం లేనందున కొందరు కాలినడకన మహారాష్ట్ర నుంచి బయల్దేరారు. వారిని ఆదిలాబాద్​ వద్ద పోలీసులు అడ్డుకుని... నెల రోజులుగా నిర్బంధం ఉంచారు. ఇప్పటికైనా తమ తల్లిదండ్రుల వద్దకు తమను చేర్చాలంటూ విద్యార్థులు వేడుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాల విద్యార్థుల గోస
తెలుగు రాష్ట్రాల విద్యార్థుల గోస
author img

By

Published : Apr 27, 2020, 6:31 PM IST

మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లాలో సేంద్రీయ వ్యవసాయ శిక్షణ పొందుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు లాక్​డౌన్​ శాపంగా మారింది. లాక్​డౌన్​ కారణంగా రవాణా లేనందున విద్యార్థులు కాలినడకన స్వస్థలాలకు బయలుదేరారు. వీరిని మార్చి 29న ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో అధికారులు అడ్డుకున్నారు.

స్క్రీనింగ్‌ పరీక్షల్లో కరోనా లక్షణాలు రానప్పటికీ 14 రోజుల గడువు పేరిట క్వారంటైన్​కు తరలించారు. ఇప్పుడు నెలరోజులవుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇంట్లో వారికి అనారోగ్యంగా ఉన్న వెళ్లలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు... దాదాపుగా 105 మంది విద్యార్థుల వేదన అరణ్యరోదనగా మిగిలింది. వీరి పరిస్థితిపై మరింత సమాచారాన్ని ఈటీవీ భారత్​ ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు.

తెలుగు రాష్ట్రాల విద్యార్థుల గోస

ఇదీ చూడండి: పింఛన్​దారులకు కరోనా వస్తే పరిస్థితేంటి..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.