ఆదిలాబాద్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరిపారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి మొక్కలు నాటారు.
అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేశారు. కలెక్టరేట్లో గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్రీదేవసేన, ఎస్పీ విష్ణువారియర్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాఠోడ్ బాపూరావు, జడ్పీ ఛైర్మన్ రాఠోడ్ జనార్ధన్ పాల్గొన్నారు.
- ఇదీ చూడండి:ఆరేళ్ల పోలీసు రంగంలో.. అనేక మార్పులు