ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం కన్నాపూర్లో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం నాడు గోపాల్ అనే విద్యార్థి ఐదుగురు స్నేహితులతో కన్నాపూర్ వాగు సమీపంలో ఓ ఆహ్లాదకరమైన ప్రదేశానికి విహారయాత్రకు వెళ్లారు.వెంట తీసుకెళ్లిన అల్పాహారాన్ని తిని... వాగులో ఈత కొట్టేందుకు దిగారు. సరదాగా ఆడుకుంటుండగా... గోపాల్ గల్లంతయ్యాడు. గమనించని స్నేహితులు ఇంటికి పరుగులు తీశారు.
రాత్రికి కూడా గోపాల్ ఇంటికి రాలేదని తల్లిదండ్రులు ఆరా తీశారు. ఎక్కడా కనిపించకపోగా... స్నేహితులతో కలిసి కన్నాపూర్ వాగు వైపు వెళ్లినట్లు తెలిసింది. రాత్రంతా గాలించినా ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం గ్రామస్థులతో కలిసి వాగులో వెతకగా... గోపాల్ శవమై కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని ఉట్నూరు ఆసుపత్రికి తరలించి... పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. గోపాల్ లిటిల్ ఫ్లవర్ స్కూలులో పదోదరగతి చదువుతున్నాడు.
ఇదీ చూడండి: 'ఆర్టీసీ సమ్మెపై 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి'