ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న నర్సులు మూడు రోజులుగా నిరసన కొనసాగిస్తున్నారు. ఏడు నెలలుగా తమకు వేతనాలు రావడం లేదంటూ విధులు బహిష్కరించి.. ఆసుపత్రి ఎదుట బైఠాయించి రిమ్స్ సంచాలకుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కరోనా సమయం నుంచి విధులు నిర్వహిస్తోన్న తమకు వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో సమ్మెకు దిగినట్లు తెలిపారు. జీతాల విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చేవరకు విధుల్లో చేరేది లేదని స్పష్టం చేశారు.
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నర్సులు, ఇతర సిబ్బంది నిరసనలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: యూపీలో మైనర్ అపహరణ, సామూహిక అత్యాచారం