ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ మల్లికార్జున స్వామి ఆలయం చెరువు మధ్యలో ఉంటుంది. శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయానికి చారిత్రక ప్రాశస్త్యం ఉంది. గ్రామంలో నెలకొన్న కరవుని పారదోలడానికి శివుడే స్వయంగా రాత్రికి రాత్రి ఈ చెరువును తవ్వి మధ్యలో లింగరూపంలో వెలిశాడని ఐతిహ్యం. వర్షాకాలంలో ఈ చెరువు నిండినప్పుడు కూడా భక్తులు 3-4 అడుగుల లోతు నీటిలో దాదాపు 500 మీటర్లు నడుచుకుంటూ వెళ్లి స్వామిని దర్శించుకుని పూజలు చేస్తారు.
శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్దసంఖ్యలో తాడు సాయంతో నీటిలో నడుచుకుంటూ వెళ్లి స్వామిని దర్శించుకున్నారు.
ఇదీ చూడండి: jeevitham foundation: వందలాది అభాగ్యులకు 24ఏళ్ల యువతే 'అమ్మ'