ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని పలు ప్రైవేటు ఉన్నత పాఠశాలలో షీటీం బృందాలు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆడపిల్లలతో మాట్లాడుతూ ఎవరైనా ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. మహిళలు, ఆడపిల్లల రక్షణ కోసమే షీటీం బృందాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. బాలికలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. మహిళలపై వేధింపులు, బెదిరింపులకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి గ్రామం, మండల కేంద్రాల్లో షీటీం బృందాలు సంచరిస్తున్నాయని తెలియజేశారు.
ఇవీ చూడండి: " ఐదు రూపాయల భోజనం ఎట్లుంది పెద్దాయన.."