ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లోని ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా ఆలయ ప్రాంగణం జనసంద్రంగా మారింది. జాతర ప్రారంభమై ఐదు రోజులు కావొస్తున్నా.. రోజు రోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి.. దేవతను దర్శించుకుంటున్నారు.

నాగోబా దేవతను ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్ దర్శించుకున్నారు. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటీడీఏ పీవో భవేష్ మిశ్రాలు ఘనస్వాగతం పలికారు. అనంతరం నాగోబా దేవతకు ప్రత్యేక పూజలు చేశారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లు ఏర్పాట్లు చేసి.. దర్శన ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.