రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత కేసు విచారణ కీలకదశకు చేరుకుంది. ఆదిలాబాద్‌లోని ప్రత్యేక కోర్టులో ఈనెల 23న ప్రారంభమైన విచారణలో భాగంగా సోమవారం శాస్త్రీయ సాక్ష్యాధారాలపై వాదనలు జరగగా... తదుపరి విచారణ రేపటికి వాయిదాపడింది.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలో సమతపై నవంబర్ 24న జరిగిన సామూహిక అత్యాచారం, హత్యలో కీలకమైన శవపంచనామా, రక్త, డీఎన్‌ఏ లాంటి శాస్త్రీయ సాక్ష్యాధారాలతోపాటు ఆ రోజు నిందితులు షేక్ బాబు, షేక్ షాబోద్ధీన్, షేక్ మగ్ధుం వాడిన సెల్‌ఫోన్ వినియోగంపై ప్రాసిక్యూషన్, డిఫెన్స్ న్యాయవాదిపై వాదనలు వినిపించారు.
అనంతరం ప్రత్యేక కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. కొత్త ఏడాది పదోతేదీలోగా సమత కేసు తుది తీర్పువచ్చే అవకాశం ఉందని డిఫెన్స్ న్యాయవాది తెలిపారు.
ఇవీ చూడండి: జలహారతి... మానేరులో సీఎం పూజలు