ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో కార్యాలయం ఎదుట కార్మికులు రిలే దీక్షలకు శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 5వ తేదీ నుంచి రాష్ట్ర కమిటీ సమ్మె చేపట్టాలని నిర్ణయించింది. ఆ మేరకే ఈ రోజు ఆదిలాబాద్‌లో ధర్నా ప్రారంభించారు. ఐకాస ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ దీక్షల్లో అన్ని సంఘాలు పాల్గొన్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, వేతన సవరణ చేపట్టాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్మికులంతా సిద్ధంగా ఉండాలని ఐకాస జిల్లా కన్వీనర్ చారి తెలిపారు.
ఇవీ చూడండి: నిలోఫర్‌లో క్లినికల్ ట్రయల్స్‌పై విచారణ