ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పెన్‌గంగా నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాపై అధికార యంత్రాంగం ఎట్టకేలకు దృష్టి సారించింది. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దున ఉన్న ఆనంద్‌పూర్ గ్రామ సమీపంలో భారీ మొత్తంలో అక్రమ ఇసుక డంపులను అధికారులు గుర్తించారు.
నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాపై ఇటీవల ఈటీవీ భారత్-ఈనాడులో కథనం ప్రచురితమైంది. ఫలితంగా అధికార యంత్రాంగం స్పందించింది. ఆదిలాబాద్ ఇంఛార్జీ ఆర్డీవో వినోద్‌కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్ల నేతృత్వంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
పెన్‌గంగా నది నుంచి ఇసుకను తవ్వుతున్న ఒక జేసీబీతో సహా రెండు టిప్పర్లను ఘటనా స్థలంలో గుర్తించిన అధికారులు.. టిప్పర్లను జైనథ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇందులో కీలక పాత్రదారుల కోసం అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.