Rajagopal Reddy comments on TRS: కర్ణాటకతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలుండే అవకాశం ఉందని బీజేపీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో భాజాపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం నేపత్యంలో నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన విలేకరులతో మాట్లాడారు.
అధికార దుర్వినియోగంతో మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ది గెలుపే కాదని, నైతికంగా తాను గెలిచినట్లు దేశవ్యాప్తంగా ప్రజలు ఏకీభవించారని పేర్కొన్నారు. మునుగోడు ఎన్నికతో బీజేపీకి పెరుగుతున్న ఆదరణతో ముఖ్యమంత్రికి భయం నెలకొందని తెలిపారు. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని, దానిలో బలమైన నాయకులు లేరని, సీనియర్ నాయకులు ఆలోచించి బీజేపీలోకి రావాలని సూచించారు. ఉమ్మడి అదిలాబాద్‌లో పది స్థానాలు గెలిపించే బాధ్యత తాను తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
కర్ణాటకతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలుంటాయి. కాబట్టి నిర్మల్ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న నాయకులకు కార్యకర్తలకు మీడియా ద్వారా నిర్మల్ నియోజకవర్గ, ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలందరికి కూడా నా విజ్ఞప్తి ఏమిటంటే, ఈరోజు నుంచి అమిత్ షాను కలిస్తే కేసీఆర్ మునుగోడులో గెలిచే వరకు నిద్రపోలేదు. పోలీసులను అడ్డంపెట్టుకొని అధికార దుర్వినియోగం చేసి 10 వేల ఓట్లతో అడ్డదారినా గెలిచినా తెలంగాణ సమాజం గానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గానీ భారతదేశం మొత్తం కూడా ముక్త కంఠం తోటి నైతికంగా బీజేపీ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలిచాడని, 10వేల అనేది అసలు గెలుపే కాదన్నారు. -కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
ఇవీ చదవండి: