ETV Bharat / state

పనిచేయని ప్రింటర్​.. వాట్సప్​లో ప్రశ్నాపత్రం పంపి ఎగ్జామ్ రాయించిన ప్రిన్సిపల్ - పరీక్షలో ఫోన్​లో చూసి మాస్ కాపియింగ్

Question Paper on WhatsApp: ఆదిలాబాద్‌ ప్రభుత్వ సైన్స్‌ డిగ్రీ కళాశాలలో ఇంటర్నల్‌ పరీక్షలకు ఎంచక్కా సెల్​ఫోన్​ అనుమతించి ఎగ్జామ్స్​ రాయించారు అధ్యాపకులు. అదేంటి అని అడిగితే వారు చెప్పిన సమాధానానికి ఆశ్చర్యపోవాల్సిందే.. ఇంతకీ ఏం చెప్పారో మీరే చూడండి.

exam fraud
exam fraud
author img

By

Published : Feb 5, 2023, 9:17 AM IST

Question Paper on WhatsApp: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ప్రస్తుతం డిగ్రీ ఇంటర్నల్‌ పరీక్షలు జరుగుతున్నాయి. వీటికి 20 మార్కులు ఉంటాయి. వాస్తవానికి మామూలు పరీక్షల లాగానే ఇంటర్నల్‌ పరీక్షలకు ప్రశ్నపత్రం ఇవ్వాలి. ఇందుకు భిన్నంగా ఆదిలాబాద్‌ ప్రభుత్వ సైన్స్‌ డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు శనివారం వాట్సప్‌లోనే ప్రశ్నపత్రం పంపించారు.

విద్యార్థులు దానిని సెల్‌ఫోన్‌లో చూస్తూ ఆన్సర్‌ షీటులో జవాబులు రాస్తూ కనిపించారు. కొందరు విద్యార్థులు ఇదే అదనుగా భావించి ఇంటర్నెట్​లో సమాధానాలు వెతికి పరీక్ష రాశారు. ఈ విషయమై ప్రిన్సిపల్‌ జగ్‌రాం అంతర్బేదితో మాట్లాడగా.. ‘‘వాస్తవానికి పేపర్‌ ఇవ్వాలి. ప్రింటర్‌ పాడవడంతో పిల్లలకు వాట్సప్‌ గ్రూపులో పోస్టు చేశాం. పిల్లలు కాపీ కొట్టకుండా ఆరుబయటే కూర్చోబెట్టి పరీక్ష రాయించాం’’ అని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.