ETV Bharat / state

పంజా విసురుతున్న పులి... వణుకుతున్న మణ్యం - తెలంగాణలో పులిదాడులు

పెద్దపులి! అడవిలో తిరుగులేని జంతువు. వన సామ్రాజ్యానికి తానే నియంత. పంజా విసిరితే ప్రాణం పోవాల్సిందే. అభయారణ్యంలో సంచరించాల్సిన పులి.. జనారణ్యంలోకి ప్రవేశించి.. మనుషులపై విరుచుకుపడుతోంది. ఇటీవల తెలంగాణ కుమురంభీం జిల్లాలో ఇద్దరి ప్రాణాలను బలిగొనడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అటవీశాఖ అప్రమత్తమైనప్పటికీ... పులిజాడ కనుక్కోలేకపోవడం వల్ల.. గిరిజన గ్రామాల్లో అలజడి కనిపిస్తోంది. తెలంగాణ -మహారాష్ట్ర సరిహద్దు ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు కరవైంది. ప్రసిద్ధ కవ్వాల్‌ అభయారణ్యంలో పులులే లేవు.. అనుకుంటున్న తరుణంలో.. స్థానికులు ఈ పులిదాడితో.. క్షణక్షణం.. భయం భయంగా బతుకుతున్నారు. ఇంటి నుంచి కాలు బయటపెట్టేందుకు జంకుతున్నారు.

పంజా విసురుతున్న పులి... వణుకుతున్న మణ్యం

author img

By

Published : Dec 18, 2020, 1:14 AM IST

Updated : Dec 18, 2020, 1:22 AM IST

పంజా విసురుతున్న పులి... వణుకుతున్న మణ్యం

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అటవీప్రాంతం గజగజ వణుకుతోంది. మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి వలస వస్తున్న పెద్దపులుల సంచారంతో కంటిమీద నిద్ర కరవైంది. అటవీశాఖ చేస్తున్న ప్రయత్నాలు... ఎలాంటి ఫలితం ఇవ్వడం లేదు సరికదా ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కవ్వాల్‌ పులుల అభయారణ్యం 2015 చ.కి.మీటర్ల విస్తీర్ణంతో ఉన్నప్పటికీ.. పెద్దపులుల జాడ కనిపించడం లేదు. అదే మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌ పులుల అభయారణ్య 148 చ.కి.మీటర్ల విస్తీర్ణంతోనే ఉన్నప్పటికీ పులుల సంఖ్య 20 ఉంటే తాడోబా అటవీప్రాంతంలోనైతే 48 పెద్దపులుల వరకు ఉన్నట్లు ప్రాథమిక లెక్కగా నిర్ధరణ అవుతోంది.

ఏడాదైనాా.. జాడ దొరకలే..

తిప్పేశ్వర్‌, తాడోబా అభయారణ్యాల్లో విస్తీర్ణం కంటే పులుల సంఖ్య ఎక్కువ ఉండటంతోనే పక్కనే ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయని అటవీసిబ్బంది అభిప్రాయపడుతున్నారు. తొలుత ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్‌ మండలం తాంసి(కె)లో 2019 ఆగస్టు 21న బొజ్జె పోసానికి చెందిన ఆవును హతమార్చడం నుంచి పులుల దాడులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికి ఏడాది దాటినా దాడి చేసిన పులుల జాడ కనుక్కోవడంలో అటవీశాఖ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇప్పుడు కుమురంభీం మండలంలో మనుషులను చంపేదాకా వెళ్లడం కలకలం సృష్టిస్తోంది. ఫలితంగా కుమురంభీం జిల్లాలోని ప్రాణహిత పరివాహాక ప్రాంతం మొదలుకొని... ఆదిలాబాద్‌ జిల్లాలోని పెన్‌గంగా పరివాహాక ప్రాంతం వరకు దినదినగండంగా మారింది.

ఇవే కారణాలా...

తొలుత ఒకటే పులి ఉన్నట్లుగా భావించినప్పటికీ... ఇప్పుడు వాటి సంఖ్య ఎక్కువే ఉండొచ్చనని భావిస్తున్నారు. అయితే కచ్చితమైన సంఖ్య ఎంతనేది అటవీశాఖ నిర్ధారించలేక పోతోంది. ఒకప్పుడు 43 శాతం అటవీప్రాంతంతో విస్తరించి ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అడవి వైశాల్యం.. ఇప్పుడు 23శాతానికి పడిపోయింది. ఫలితంగా అభయారణ్యంలో సరైన ఆవాసం లభించక పులులు మైదానప్రాంతాల్లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం బహిర్గతమైతే ప్రజలు మరింత భయాందోళనకు గురవుతారనే ఆలోచనతో అటవీశాఖ గోప్యంగానే ఉంచుతుందనే వాదన వినిపిస్తోంది.

ప్రాణానికి భద్రతేది..

నవంబర్‌ 11న దహేగాం మండలం దిగిడలో పశువులను మేపడానికి వెళ్లిన విఘ్నేష్‌ పులి పంజాకు చిక్కడం..రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఆగమేఘాల మీద అటవీశాఖ రెండు బోన్లు, 30 సీసీ కెమెరాలు అటవీప్రాంతంలో అమర్చినప్పటికీ పులి జాడ కనిపించలేదు. అదే నెల 29న పెంచికల్‌పేట మండలం కొండపల్లిలో పత్తి తీయడానికి వెళ్లిన పసుల నిర్మల అనే బాలిక... మరో పులి పంజాకు బలైంది. విఘ్నేష్‌, నిర్మల ఇద్దరూ ఆదివాసీ బిడ్డలే. ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అయితే ఈ ఆర్థిక సాయం స్థానికుల్లో నెలకొన్న అభద్రతను, భయాన్ని తొలగించలేకపోతోంది.

అధికారుల మధ్య సమన్వయలోపం

ప్రజల భయానికి మరింత బలం చేకూర్చేలా పులుల సంచారం క్రమంగా పెరుగుతుందే తప్ప తగ్గడంలేదు. గత నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌, తాంసి, తలమడుగు, జైనథ్‌, ఆదిలాబాద్‌ గ్రామీణ మండలాల్లో పులి హల్చల్‌ చేసిన ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ డిసెంబర్‌ 14న భీంపూర్‌ మండలం తాంసి(కె)లో మరో ఆవును పులి చంపేసింది. ప్రధానంగా పెద్దపులులు డిసెంబర్‌ మొదలు ఫిబ్రవరి వరకు ఆవాసాల ఏర్పాటు కోసం సంచరిస్తుంటాయనేది అటవీశాఖ సిబ్బంది చెబుతున్న మాట. ఇందులో భాగంగానే తిప్పేశ్వర్‌ , తాడోబా నుంచి పులుల రాకపెరుగుతున్నట్లుగా వెల్లడవుతోంది. వస్తున్న పులులను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించే ప్రయత్నం అటవీశాఖ చేయలేకపోతోంది. పక్కనే ఉన్న మహారాష్ట్ర అటవీ అధికారులతో సరైన సమన్వయం కూడా కనిపించడంలేదు.

పంటలను పొలాల్లోనే వదిలేసి

పులుల భయం కారణంగానే ఆసిఫాబాద్‌, సిర్పూర్‌(టి) నియోజకవర్గాలతోపాటు బోథ్‌, ఆదిలాబాద్‌ నియోజకవర్గాల్లోకి వేలాది ఎకరాల్లో పంటను పొలాల్లోనే వదిలేయాల్సిన దుస్థితి నెలకొంది. ఎకరాకు సగటున 5క్వింటాళ్ల పత్తి ...అంటే క్వింటాకు 5వేల చొప్పున కనీసం 25వేల రూపాయలు ప్రతి రైతు నష్టపోయే పరిస్థితి. గ్రామాల్లో సిబ్బందితో చేయించే పహారాకు ఇస్తున్న ప్రాధాన్యం.. అటవీప్రాంతంలో పులుల్ని పట్టుకునేందుకు ఇవ్వడంలేదని స్థానికులు వాపోతున్నారు. బయటకు చెప్పకపోయినా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే అటవీ సిబ్బందిలోనూ భయమే కనిపిస్తోంది. కళ్లముందే ప్రాణాలు పోవడం, చేతికి రావాల్సిన పంట నేలపాలు కావడం... రైతులను కలిచివేస్తోంది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం మాటెలా ఉన్న కనీసం ప్రాణాలకైనా రక్షణ కల్పించాలని ఆదివాసీలు వేడుకుంటున్నారు.

టేకు వనాల పుట్టిల్లుగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అటవీప్రాంతానికి ఎంత ప్రాముఖ్యత ఉందో... ప్రజల ప్రాణాలకు అంతే ప్రాధాన్యం ఉంది. ఇకనైనా పాలకులు...పులుల దాడులపై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుని...ఆదివాసీల ప్రాణాలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో అమాయకపు గిరిజనులు మరింత మంది తమవిలువైన ప్రాణాల్ని పొగొట్టుకునే ప్రమాదం ఉందని మానవహక్కుల నేతలు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి: కుమారుడి కోసం ఏడాదిన్నరగా పరితపిస్తున్న తల్లిదండ్రులు

Last Updated : Dec 18, 2020, 1:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.