పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన అభ్యర్థుల ఆశ ఎట్టకేలకు నెరవేరింది. నియామక ఉత్తర్వులు జారీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో వారిలో ఆనందం వెల్లి విరుస్తోంది. ఆదిలాబాద్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన 290 మందికి జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా నియామక పత్రాలు అందించారు. 28 మంది అభ్యర్థుల నియామకాన్ని వివిధ కారణాలతో నిలిపేశారు. పత్రాలు అందుకున్న వారు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు.
హర్షం వ్యక్తం చేసిన అభ్యర్థులు
ఆదిలాబాద్లో మొత్తం 335 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా.. అక్టోబర్ 10న రాతపరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించారు. డిసెంబర్ 21న అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించారు. ఎన్నికల షెడ్యూల్ వల్ల నియామకాలు ఆలస్యమయ్యాయి. గురువారం ఎన్నికలు ముగిసిన తరువాత.. నియామక పత్రాలు అందించారు. ప్రభుత్వ నిర్ణయంపై కొత్త కార్యదర్శులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల పత్రాలు అందించని వారికి త్వరలో అందిస్తామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి : అతివేగం తీసింది ఇద్దరు యువకుల ప్రాణం