ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని శివాజీ చౌక్‌లో ఎంపీ సోయం బాపూరావు చిత్రపటానికి భాజపా నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనేతరుల సమస్యల గురించి పార్లమెంట్లో ఎంపీ మాట్లాడడం హర్షణీయమని పేర్కొన్నారు. 70 ఏళ్ల స్వాతంత్ర పార్లమెంట్లో ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనేతరుల గురించి ఎవరు మాట్లాడలేదని... కేవలం ఒక్క సోయం బాపూరావు మాత్రమే మాట్లాడారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు మాదవ్ రావు, కదం బాబారవు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'ఆర్టీసీలో ఏ ఒక్క కార్మికుడు తృప్తిగా పనిచేయడం లేదు'