నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భైంసా మండలం గుండెగాం గ్రామం వద్ద నిర్మిస్తున్న రంగారావు పాల్సికర్ ప్రాజెక్టుకు వరద నీరు రావడం వల్ల గుండెగాం వంతెన వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితి ఇలానే కొనసాగితే గుండెగాం గ్రామం ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. గత సంవత్సరం ఈ గ్రామం ముంపునకు గురైతే బాధితులకు భైంసాలో పునరావాసం కల్పించారు.
ఇదీ చూడండి :'బ్రేకు వేయబోయి ఎక్సలేటర్ తొక్కింది'