అన్ని గ్రామాల్లోనూ సేంద్రీయ ఎరువైన వర్మీ కంపోస్టును ఉత్పత్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. ఈ విషయంలో ఆదిలాబాద్ జిల్లా ముఖ్రాకే గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ముఖ్రాకే గ్రామంలో సేకరించిన తడి చెత్త ద్వారా తయారు చేసిన వర్మీకంపోస్టు ఎరువును ఆ ఊరి సర్పంచ్ శుక్రవారం హైదరాబాద్లో మంత్రికి అందించారు.
గత రెండు నెలల్లో 75 వేల రూపాయలు.. ఏడాది కాలంలో నాలుగు లక్షల రూపాయలు.. వర్మీ కంపోస్టు అమ్మకాల ద్వారా వచ్చినట్లు తెలిపారు. సేంద్రీయ ఎరువు తయారీతో ముఖ్రాకే గ్రామం ఆదర్శంగా నిలవడం అభినందనీయమని ఎర్రబెల్లి అన్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్లో నాలుగు, మహబూబ్‌నగర్‌లో మూడుచోట్ల డ్రైరన్