ఆదిలాబాద్‌లో గణేశుని శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న.. జడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్దన్తో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహానికి పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన శోభయాత్ర ఆద్యంతం ఆదివాసీ సంస్కృతి, ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.
జడ్పీఛైర్మన్తో కలిసి ఎమ్మెల్యే ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. భజన బృందంతో ఆడి పాడారు. ఎమ్మెల్యే జోగురామన్న గుస్సాడీ నృత్యం చేసి అక్కడ వారిలో ఉత్తేజం నింపారు. పట్టణ పుర వీధుల గుండా శోభ యాత్ర చేసి.. వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికారు.
ఇదీ చూడండి: MLA VIRAL VIDEO: ఎమ్మెల్యే సారు.. డుగ్గు డుగ్గు సాంగు..
Bullettu bandi: డుగ్గు.. డుగ్గు పాటను కొత్తగా పాడిన ఉపాధ్యాయుడు