రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్నగర్లో ఉన్న బురాన్ఖాన్ చెరువు లోతట్టు ప్రాంతం... గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. ఆ ప్రాంతాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు.
భారీ వర్షాల కారణంగా ఆర్నెళ్లపాటు చెరువులోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడం బాధాకరమని పేర్కొన్నారు. ఆ ప్రాంతానికి నేడు శాశ్వత ప్రణాళిక ప్రకారంగా బురాన్ఖాన్ చెరువులోని లోతట్టు ప్రాంతంలో ఉన్న కట్ట ఎత్తు, వెడల్పు పెంచి.. భవిష్యత్తులో కింది ప్రాంతంలో ముంపునకు గురికాకుండా అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. దానికి గాను రూ. 5కోట్ల వ్యయంతో పనులు ప్రారంభంకానున్నాయి.
పక్కా ప్రణాళిక ద్వారా డ్రైనేజీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా చెరువును సుందరీకరణలో చేర్చాలని అధికారుల్ని ఆదేశించారు.
ఇదీ చూడండి: కారులో పురోహితుడు.. వేదికపై వధూవరులు.. పెళ్లి ఎలా జరిగిందంటే..?