నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలను కాపాడాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. లేదంటే ఉద్యోగాలు పోతాయని స్పష్టం చేశారు. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనల్లోనే పేర్కొన్నారని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 182 కోట్ల మొక్కలు నాటామని తెలిపారు.
ఆరోవిడత హరితహారంలో మరో 30 కోట్ల మొక్కలను నాటుతామన్నారు. రెవెన్యూ, అటవీశాఖల మధ్య సమన్వయంతో అటవీభూమల రక్షణ జరుగుతుందన్నారు. పోడు వ్యవసాయంతో కొంత సమస్య ఉన్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : ఒడిశా తీరంలో ఉపరితల ఆవర్తనం.. ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు