అసంక్రమిత వ్యాధి బాధితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 1,58,932 మంది ఉండగా... వీరిలో బీపీతో 1,15,960 మంది బాధపడుతున్నారు. మధుమేహంతో 42,972 మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీరిలో 1,23,610 మందిని ఆన్‌లైన్‌లో సిబ్బంది నమోదు చేశారు. వారందరికి ప్రజారోగ్య సిబ్బంది ఇంటి వద్దకే మందులను అందజేస్తున్నారు.
ఆన్‌లైన్ నమోదులో కుమురంభీం ముందంజ
అసంక్రమిత వ్యాధులబారిన పడ్డ వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో కుమురంభీం జిల్లా ముందంజలో ఉంది. 101 శాతం నమోదును పూర్తి చేసింది. రెండో స్థానంలో ఆదిలాబాద్ (95 శాతం), మూడో స్థానంలో మంచిర్యాల జిల్లా 86 శాతం పూర్తి చేసింది. నిర్మల్ జిల్లా కేవలం 65 శాతం వివరాలు మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదు చేసి చివరి స్థానంలో ఉంది.
ఎన్‌సీడీ (నాన్ కమ్యూనికేబుల్ డీసీజెస్) రుగ్మతలతో బాధపడుతున్న ఉమ్మడి జిల్లాలోని బాధితులందరికీ మందులు ఇక ఇంటికే రానున్నాయి. గతేడాది ఫిబ్రవరి నుంచి ఆరోగ్యశాఖ ఈ సర్వేను ప్రారంభించి శిబిరాలు ఏర్పాటు చేసింది. అసంక్రమిత వ్యాధి (ఎన్‌సీడీ) బాధితులను సమగ్ర కుటుంబ సర్వే వివరాల ఆధారంగా గుర్తించింది. అసంక్రమిత వ్యాధుల్లో బీపీ (రక్తపోటు), షుగర్ (మధుమేహం) బాధితులను గుర్తించారు. వీరి వివరాలను అంతర్జాలంలో నమోదు చేశారు. ఇలా అంతర్జాలంలో నమోదైన వారందరికి ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు బాధితులకు అవసరమైన మందులను ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తున్నారు.
జిల్లాల వారీగా గుర్తించిన ఎన్‌సీడీ బాధితులు, జూన్ 27 వరకు ఆన్‌లైన్‌లో నమోదైన వారి వివరాలు..
ఇవీ చూడండి: బెల్లంపల్లిలో 30 కరోనా కేసులు.. ఆందోళనలో కార్మికులు