Maoist Leader Katakam Sudarshan Died Of Heart Attack : మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ గత నెల 31న గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక ప్రకటనను విడుదల చేశారు. ఆయన ఛత్తీస్‌గఢ్‌లోని అభుజ్‌మడ్ ప్రాంతంలో గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. ఆనంద్ స్వస్థలం తెలంగాణలోని మంచిర్యాల జిల్లా. ఈ సమాచారం కుటుంబ సభ్యులకు చేరడంతో.. వారు కన్నీటి పర్యంతమయ్యారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనంద్ తల్లిదండ్రులు మల్లయ్య, వెంకటమ్మ గతంలోనే మృతి చెందారు. వీరికి ఆరుగురు సంతానం కాగా.. వారిలో సుదర్శన్ అందరికంటే పెద్దవాడు. ఇతనికి ముగ్గురు సోదరులు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. చిన్నప్పటి నుంచి మంచిగా చదువుకొనే వారని తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో చేరి డిగ్రీ చదువుతున్నారని వివరించారు. ఆ సమయంలోనే విప్లవ ఉద్యమాల పట్ల ఆకర్షితులై.. మావోయిస్టుల దళంలో చేరారని చెప్పారు. ఆరు నెలలు పాటు సింగరేణి సంస్థలో ఉద్యోగం కూడా చేశారన్నారు. ఆ తర్వాత ఉద్యోగం పూర్తిగా వదిలేసి.. ఉద్యమంలో నిమగ్నమైపోయారు. అక్కడి నుంచి అంచెంచెలుగా ఎదుగుతూ.. జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా, ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా, పోలిట్ బ్యూరో సభ్యుడిగా పని చేశారు.
Top Maoist Leader From Telangana Katakam Sudarshan : ఉద్యమంలోనే మావోయిస్టు మహిళా నేత లలితక్కతో వివాహం జరిగింది. ఆతర్వాత జరిగిన ఎన్కౌంటర్లో ఆమె మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. 1994లో జిల్లా కార్యదర్శిగా ఉన్న సమయంలోనే వాంకిడి మండలం సర్కపల్లి ఎన్కౌంటర్లో త్రుటిలో తప్పించుకొని.. సుదర్శన్ ఇప్పటివరకు పోలీసులకు చిక్కలేదన్నారు. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో రాడికల్ యువజన సంఘం, పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో శ్రీశ్రీ హాజరైన సమయంలో సుదర్శన్ కూడా పాల్గొన్నారని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
Maoist Leader Katakam Sudarshan Passed Away : గజ్జల గంగారంకు ఈయన సమకాలీకుడని తెలిపారు. ఆయన మరణవార్త తెలిసిన తర్వాత ఈ ఆదివారం వివిధ పార్టీల నాయకులతో పాటు అభిమానులు సుదర్శన్ ఇంటికి తరలివచ్చి.. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సుదర్శన్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. మావోయిస్టు కేంద్ర కమిటీ వచ్చేనెల ఆగస్టు 3 వరకు స్మారక సభలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఆయన మరణంతో తను పుట్టిన గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చదవండి :