ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా ఆవిర్భవించిన భీంపూర్ మండల సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి కమిటీ ఛైర్మన్ ప్రహ్లాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మండలంలో వ్యవసాయ ఉప మార్కెట్ యార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భయపెడుతున్న కరోనా వ్యాధి నివారణపై వైద్యాధికారి సిరసీజ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పీఏసీఎస్, ఎంపీడీవో, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కరోనా నుంచి పిల్లల్ని ఇలా.. రక్షించుకుందాం!