ETV Bharat / state

ఉద్యోగాల పేరుతో మహిళలకు వల.. - ఆదిలాబాద్​ జిల్లా తాజా వార్త

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మహిళలను మోసం చేస్తూ వారిని లోబర్చుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని మంచిర్యాల జిల్లా పోలీస్ అరెస్ట్ చేశారు.

Man arrested for cheating women in the name of jobs in adilabad
ఉద్యోగాల పేరుతో మహిళలకు వల..
author img

By

Published : Feb 4, 2020, 11:02 AM IST

అమాయక మహిళలే లక్ష్యంగా ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేస్తూ వారిని లోబర్చుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిని మంచిర్యాల మందమర్రి పోలీసులు అరెస్టు చేశారు. ఉట్నూర్ మండలం షాంపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఐటీడీఏ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డ్​గా పని చేసేవాడు. నిధులు అవకతవకలపై 2017లో అతన్ని అధికారులు విధుల నుంచి తొలగించారు.అ ప్పటి నుంచి ఖాళీగా ఉంటూ అమాయక మహిళలపై వల విసరడమే వృత్తిగా పెట్టుకున్నాడు.

ఉద్యోగాల పేరుతో మహిళలకు వల..

తాను కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తానని చెబుతూ ఉద్యోగాలు ఇస్తానని పదోన్నతులు కల్పిస్తామని వందలాది మంది మహిళలతో పరిచయాలు పెంచుకున్నాడు. ఈ క్రమంలో వారి ఫోటోలు, నగ్న చిత్రాలు, వీడియోలను సేకరిస్తూ వారిని బెదిరించి లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు.

అతని బాధలు భరించలేక మందమర్రిలోని పోలీస్​ స్టేషన్​లో ముగ్గురు మహిళలు ఫిర్యాదు చేయడం వల్ల విషయం వెలుగులోకి వచ్చింది.

మందమర్రి సీఐ ఎడ్ల మహేశ్​ ఆధ్వర్యంలో ఎస్సై శివ కుమార్, పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి చరవాణీని సీజ్ చేశారు. చరవాణీని పరిశీలించగా అందులో వందలాది మంది మహిళల నగ్న, సాధారణ చిత్రాలు, ఛాటింగ్స్ బయటపడ్డాయి. నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శ్రీనివాస్​ని రిమాండ్​కి పంపినట్లు సీఐ మహేశ్​ తెలిపారు.

ఇదీ చూడండి: భార్యపై తుపాకీతో కాల్పులు..అడ్డొచ్చిన మేనమామకు బుల్లెట్లు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.