ETV Bharat / state

మరో మూడు సభల్లో పాల్గొననున్న గులాబీ దళపతి​ - హైదరాబాద్​

​​​​​​​సీఎం కేసీఆర్​ మరో మూడు పార్లమెంట్​ ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొననున్నారు.. ఈనెల 9న ఎన్నికల ప్రచారం ముగియనుంది. ప్రచార గడువు పూర్తయ్యే వరకు పర్యటనను కొనసాగించాలని గులాబీ దళపతి భావిస్తున్నారు. గతంలో నిర్దేశించిన షెడ్యూలు మేరకు గురువారం వరకు సభలున్నాయి.

మరో మూడు సభల్లో పాల్గొననున్న కేసీఆర్​
author img

By

Published : Apr 4, 2019, 5:41 AM IST

మరో మూడు సభల్లో పాల్గొననున్న కేసీఆర్​
ఆదిలాబాద్​, హైదరాబాద్​తో అనుసంధానమై ఉన్న చేవెళ్ల, సికింద్రాబాద్​, మల్కాజిగిరిలలో సభలు నిర్వహించాలని తెరాస భావిస్తోంది. ఈ నియోజకవర్గాల ప్రజల నుంచి వినతులు వస్తున్న నేపథ్యంలో ఈనెల 7న ఆదిలాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గ పరిధిలోని నిర్మల్​లో పర్యటించాలని కేసీఆర్​ నిర్ణయించారు. 8న చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని వికారాబాద్​లో సభ నిర్వహించాలని యోచిస్తున్నారు.

మల్కాజిగిరి, సికింద్రాబాద్​ నియోజకవర్గాల్లో గతంలో నిర్ణయించిన సభల్లో సీఎం పాల్గొనకపోవడం వల్ల 9వ తేదిన సభ నిర్వహించే అంశంపై మరోసారి పరిశీలించాలని పార్టీ నేతలు కోరారు. వీటన్నింటినిపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఇవీ చూడండి:'దేశ గతిని మార్చే అజెండా రూపొందిస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.